Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. తేనెలా...జాలువారే నీ పదవాహినిలో... ||2||
జీవితమే మధురముగ మారెనుగా
స్వామి నా జీవితమే మధురముగా
మారెనుగా ||2||
1. ఎక్కడో దూరాన మౌనినై నిలిచాను
ఎన్నెన్నో దారులు వెదికి వెదికి తిరిగాను... ||2||
తనువంత నీ ప్రేమతో నిండిపోని
నీ వాక్యపు వెలుగులో బ్రతుకు పండనీ ||తే||
2. నా హృదయ ద్వారాన నిలిచి యుంటివా
నీ పద సవ్వడిలో పరవశించి పోతిని ||2||
అణువణువు నీ వాణితో నిండిపోని
నీ వాక్యపు వెలుగులో బ్రతుకు పండనీ ||తే||