Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తూరుపు దిక్కున వెలసిందొక తార
చూచితిమి సంతోషముతో కనులారా
శత పురుషుని జననానికి
అదియే శుభసూచికయని ||2||
కనుగొన్నాము జ్ఞానులము
బయలుదేరాము ముగ్గురము ||2|| ||తూరుపు||
1. తార చూపిన దారిలో
ధృవతారను చూడగ పోయాము
కొండలు గుట్టలు అడవులు దాటి
యెరుషలేమును చేరాము
రారాజు జాడ కోసం
రాజ భవనమే వెదికాము
లోకాలనేలే మారేడు-రాచనగరిలో లేనేలేడు
అచ్చెరువొందిన మేము
ఆయన జాడను అడిగాము
పండితులు సూచన మేర
బయలు దేరాము ముగ్గురము ||తూరుపు||
2. అల్పముకాని య ప్రాతః
బెత్లెహేముకు వెళ్ళాము
కొండలు లోయలు యేరుల దాటి
దావీదు నగరికి చేరాము
విశ్వపాలకుడు బాలదేవుడు
పశుల పాకలో కనిపించాడు
కనుల విందుగ దర్శించి
కానుకలెన్నో అర్పించాము ||తూరుపు||
ఆనందించుడి - ఆరాధించుడి ||2||