Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తూర్పు దేశపు రాజులము
బాలయేసుకు దాసులము ||2||
ప్రభు బాలయేసుకు దాసులము ||2||
1. యుగయుగాల నిరీక్షణ
జగతికంతకూ రక్షణ
రక్షకుడా ఇమ్మానుయేలుని
బంగారముతో పూజింతు
భగవంతుడనే ప్రకటింతు ||2|| ||తూర్పు||
2. సర్వపాపముల పరిహారంబు
శాంతి మార్గమునకు ఆరంభం
పరమ పావనుడా బాలయేసుని
సాంబ్రాణితో నే సేవింతు
సకల జనులకు ప్రకటింతు ||2|| ||తూర్పు||
3. అక్షయుడౌ మహిమాన్వితునకు
రక్షకుడౌ ఇమ్మానుయేలుకు
అర్పింతును నే బోళమును ||2||
అనుసరింతు నీ మార్గమును ||2|| ||తూర్పు||