Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 6
తొలి సంధ్యనయనాల వికసింపగా
రవికాంత హృదయాన ప్రభవింపగా
రారాజుని......... శ్రీ క్రీస్తుని
1 వ చరణం..
జగమంత ఉల్లాస విరిపాన్పుయై
ఆనంద సుమమాల లర్పించగా
విశ్వాధిపతి యేసు వేంచేయగా
పుష్పార్చనలు చేసి శోభిల్లుడి
2 వ చరణం..
జనులెల్ల జేజేలు నినదింపగా
ఆత్మీయ అభిమాన ముప్పొంగగా
జననేత మెస్సయ్య వేంచేయగా
సంకీర్తనలు చేసి రాజిల్లుడీ.