Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి
తరలిరండి ఓ భక్త జనమా కదలిరండి
వదువు సంఘమాస
తండ్రి దేవుని స్తుతియింపగా
యేసు దేవుని కీర్తింపగా
ఆత్మ దేవుని ఘనపరచగా
తరలిరండి పూజాబలికి' - ||2||
స్వాగతం సుస్వాగతం ...
పూజాబలికి ఘనస్వాగతం
1 వ చరణం..
ద్రాక్షకు తీగకు సంబంధము
దేవునకు మనకు అనుబంధము
గురుశిష్యులకు ప్రేమ బంధము
విశ్వాసులకు మోక్షభాగ్యము ||తర||సా||
2 వ చరణం..
మానవాళికి ముక్తినొసగగా
మహోన్నతుని మహిమ పరచగా
సర్వోన్నతుని స్తుతియింపగా
ఆత్మ దేవుని వరములు వేడగా ||తర||సా||