Type Here to Get Search Results !

యేసు రాజుగా వచ్చుచున్నాడు ( yesu rajuga vachuchunadu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


llపల్లవిll 

యేసు రాజుగా వచ్చుచున్నాడు

భూలోకమంతా తెలుసుకొంటారు ll2ll 

రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు ll2ll 

రారాజుగా వచ్చు చున్నాడు ll2ll llయేసుll 


1వ చరణం.. 

మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు

పరిశుద్దులందరిని తీసుకుపోతాడు ll2ll 

లోకమంతా శ్రమకాలం ll2ll 

విడువబడుట బహుఘోరంllయేసుll 


2 వ చరణం.. 

ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది

ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది ll2ll 

ఈ సువార్త మూయబడున్‌ ll2ll 

వాక్యమే కరువగును llయేసుll 


3వ చరణం.. 

వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును

ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును ll2ll 

నీతి శాంతి వర్ధిల్లును ll2ll 

న్యాయమే కనబడును llయేసుll 


4 వ చరణం.. 

ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర

సాగిలపడి నమస్కరించి గడగడలాడును ll2ll 

వంగని మోకాళ్ళన్నీ ll2ll 

యేసయ్య యెదుట వంగిపోవును llయేసుll 


5 వ చరణం.. 

క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ

కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు ll2ll 

రెప్ప పాటున మారాలి ll2ll 

యేసయ్య చెంతకు చేరాలి llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section