Telugu Lyrics
అపరాదిని యేసయ్యా - కృప జూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో - నపరాధములను క్షమించు
సిలువకు నిను నే గొట్టితిని - తులవలతో జేరితిని
కలుషంభులను మోపితిని - దోషుండనేను ప్రభువా
ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యా
ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ
దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబుగాయములను
గోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా
చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత
నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా
శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా
అక్షయభాగ్యము నియ్యా - మోక్షంబు జూపితివయ్యా
Song Lyrics in English
Aparadini Yesayya - Krupa Joopi Brovumayya
Nepamenchakaye Nee Krupalo - Naparaadhamulanu Kshaminchu
Siluvaku Ninu Ne Gottitini - Tulavalatho Jeritini
Kalushambhulanu Mopitini - Doshundaneenu Prabhuva
Prakkalo Ballepupotu - Grakkuna Podichiti Nene
Mikkili Baadhinchitini - Makkava Joopitivayya
Mullatho Kireetambu - Nalli Nee Shiramuna Niditi
Naa Valla Neramaye - Challani Dayagala Tandri
Daahambu Gonaga Chedu - Chirakanu Draavaniditi
Drohundanai Jesitini - Dehambugayamulu
Gorambuga Dooritini - Nerambulanu Jesitini
Kroorundanai Gottitini - Ghorampu Paapini Deva
Chinditi Raktamu Naakai - Pondina Debbalacheta
Nindalu Pettitinayyo - Sandeyamelenayya
Shikshaku Pathrudanayya - Rakshana Dechitiviayya
Akshayabhagyamu Niyya - Mokshambu Joopitiviayya