Song Lyrics in Telugu
దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము - చేయుటయే మంచిది
యెరుషలేము యెహోవాయే - కట్టుచున్న వాడనీ
ఇశ్రాయేలీయులను - పోగు చేయు వాడని
గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడనీ
వారి గాయము లన్నియు - కట్టుచున్న వాడని
నక్షత్రముల సంఖ్యను - ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని
ప్రభువు గొప్ప వాడును - అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని
దీనులకు అండాయనే - భక్తి హీనుల కూల్చును
సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి
ఆయన ఆకాశము - మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము - సిద్ధ పరచు వాడని
పర్వతములో గడ్డిని - పశువులకు మొలిపించును
అరచు పిల్ల కాకులకును - ఆహారము తానీయును
యెరుషలేము యెహోవను - సీయోనూ నీ దేవునీ
కీర్తించుము కొని యాడుము - ఆనందించు వాడని
Song Lyrics in English
Devuniki Stothramu Ganamu - Cheyutaye Manchidi
Manamandaramu Stutigaanamu - Cheyutaye Manchidi
Yerushalemu Yehovaye - Kattuchunna Vadaani
Ishraayeleeyulanu - Pogu Cheyu Vaadani
Gunde Chedarina Vaarini - Baaguchyu Vadaani
Vaari Gaayamu Lanniyu - Kattuchunna Vadaani
Nakshatramula Sankhyanu - Aayane Niyaminchenu
Vaatikanniyu Perulu Pettuchunna Vadaani
Prabhuvu Goppa Vaadunu - Adhika Shakti Sampannudu
Jñaanamunaku Aayane Mitiiyu Leni Vadaani
Deenulaku Andayane - Bhakti Heenula Koochunu
Sitaaraatho Devuni - Stutitho Keerthinchuḍi
Aayana Aakashaṁu - Meghamulatho Kappunu
Bhoomi Koraku Varshamu - Siddha Parachu Vadaani
Parvatamulo Gaddini - Pashuvulaku Molipinchuṁdu
Arachu Pilla Kaakulakunu - Aahaaramu Taaniyuṁdu
Yerushalemu Yehovanu - Siyonoo Nee Devuni
Keerthinchuṁu Koni Yaadumu - Aanandinchu Vadaani