Song Lyrics in Telugu
దేవుడు మనకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు
ఏదెనులో ఆదాముతోనుండెన్ -హానోకుతోడ నేగేను
ధీర్గదర్శకులతో నుండెను - ధన్యులు దేవుని గలవారు "తోడుగ"
దైవాజ్ఞను శిరసావాహించి - దివ్యముగ నబ్రాహము
కన్న కుమరుని ఖండించుటకు - ఖడ్గమునెత్తిన యపుడు "తోడుగ"
యేసేపు ద్వేషించబడి నపుడు - గోతిలో త్రోయ బడినపుడు
శోధనలో చెరసాలయందు - సింహాసన మెక్కిన యపుడు "తోడుగ"
ఫరోరాజు తరిమిన యపుడు - ఎర్రసముద్రపు తీరమున
యోర్దాను నది దాటినపుడు - ఎరికో కూలినా యపుడు "తోడుగ"
దావీదు సింహము నెదిరించినపుడు - దైర్యముగ, చీల్చీనపుడు
గొల్యాతును హతమార్చినపుడు - సౌలుచే తరమ బడినపుడు "తోడుగ"
సింహపు బోనులో దానియేలు - షడ్రకు, మేషకు, అబెద్నెగో
అగ్ని గుండములో వేయబడెన్ - నల్గురుగా కనబడినపుడు "తోడుగ"
పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు
అపొస్తులులు విశ్వాసులు - హింసించాబడిన యపుడు "తోడుగ"
Song Lyrics in English
Devudu Manaku Ellappudu - Thoduga Nunnadu
Edenulo Aadamutonundhen - Hanokutoṭa Negeenu
Deerghadarshakulo Nundenu - Dhanyulu Devuni Galavaru "Thoduga"
Daivaajñanu Shirasavaahinchi - Divyamu Nabraahamu
Kanna Kumari Nikhanchutaku - Khadgamunetina Yappudu "Thoduga"
Yesepu Dveshinchabadi Napudu - Gothilo Throoyabadinapudu
Shodhanalo Cherasaalayandu - Simhaasana Mekkina Yappudu "Thoduga"
Pharoraaju Tarimina Yappudu - Erasamaudrapu Teeramuna
Yordaanu Nadi Daatinapudu - Eriko Kuleena Yappudu "Thoduga"
Daavidu Simhamu Nedirinchanapudu - Dairyamuga, Cheelcheenapudu
Golyathunu Hatamaarchinapudu - Sauluchae Tarama Badinapudu "Thoduga"
Simhapu Bonulo Daaneelu - Shadraku, Mesaku, Abednego
Agni Gundayulo Veyabadenu - Nalguruga Kanabadinapudu "Thoduga"
Paulu Bandhinchabadinapudu - Peteru Cheralo Nunnapudu
Apostululu Vishwasulu - Hinshinchabadina Yappudu "Thoduga"