Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. హేపీ క్రిస్మస్ ... మెర్రి క్రిస్మస్ ||2||
మీ అందరికి - శుభాకాంక్షలు
క్రీస్తేసు జన్మదినం
ఈలోకానికే శుభదినం ||2||
1. ఏడాది గడచిననూ తోడుగ నిలిచిన దేవా
మా పాపాలు పెరిగిననూ
ప్రాణాలు నిలిపిన దేవా ||2||
నీ ప్రేమకు వెలలేదు
నీకరుణను మాపై నిలుపుమా ||2|| ||మీ||
2. రాబోవు కాలములో
రక్షణ నొసగుము దేవా ఆ జీవిత కాలమే
ముగియునేమో ఇలలోన ||2||
నీ సన్నిధి చేరుటకు
మార్గమును తెరువుమా ||2|| ||మీ|| |
3. నీరాకడ సమయంలో
నిను చేరుట ధన్యతమాకు
రాజులరాజుగా
నిను కొలుచుట దీవెనమాకు
నీ మార్గమే చల్లనిదీ
నీ రాజ్యమే ఆనందం ||2|| ||మీ||