Type Here to Get Search Results !

హాయ్! హాయ్! హాయ్! హాయ్! ( Hai! Hai! Hai! Hai! Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప హాయ్!హాయ్!హాయ్!హాయ్!హాయ్!హాయ్! 

హాయ్!హాయ్!హాయ్! ఓహో!హాయ్!హాయ్! 

పొలికేకఓరేయ్ చిన్నోడా! పెద్దోడా! 

అద్దరేతరి దాటించు 

గదలండర్రా గొర్ల కాపర్లంతా

నడవండ్రా తొందరగా తొందరగా 


ప. పోదాం పోదాము బెత్లహేము - మనము

పోదాం పోదాము దావీదు పురము ||2|| 

పశువుల కొట్టంలోన - పొత్తిగుడ్డలలోన ||2|| 

చుట్టబడి ఉన్నాడంట 

ముద్దులొలికే బాలుడంట 

అతడే అతడే లోక రక్షకుడంట

అతడే అతడే మన రక్షకుడంట ||పో|| 


1. దిట్టమైన పొట్టేళ్ళను భుజముకెత్తు 

భుజముకెత్తు ||2|| 

ఎర్ర తెల్ల మేకపిల్ల చంకన బెట్టు 

చంకన బెట్టు ||2|| 

మేలైన జీవాలను కానుకగా చేద్దామా ||2|| 

బాల ప్రభుని వరాలెన్నో 

అందుకుందామా ||అతడే|| 


2. ధర్మప్రభువు పుట్టంగా స్థలము లేదా? 

స్థలము లేదా? ||2|| 

పశులగాట పరచంగా బొంతలు 

లేవా బొంతలు లేవా ? 

మన గొంగళి దుప్పటితో 

బాలున్ని కప్పుదామా ||2|| 

బాల ప్రభుని వరాలెన్నో

అందుకుందామా ||అతడే|| 


3. మెస్సియా! క్రీస్తయా!

వచ్చావయ్యా! వచ్చావయ్యా

వేదాల్లో మాటలను నిలిపారయ్యా ||2|| 

శాంతి శాంతి దేవ రాజ్యం 

లోకానికి చాటించి 

బాల ప్రభుని వరాలెన్నో

అందుకుందామా ||అతడే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section