Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: హే ప్రభూ యేసు దేవా నీవే కదా నిరీక్షణ
కరుణతో కావరావా నీయందే మా నమ్మిక
1. దివ్యనాధా దీనరక్షా పాపములన్ పరిహరించు
రావా రాజా మమ్మేలను - మా హృదిని అలంకరింప ||హే ప్రభూ||
2. ముక్తి మార్గం మాదు దేవా - కలకాలము కాంక్షించుచూ
మహిమన్ మాకు చూపుము - నీవే మాదు మహిమలో రక్ష ||హే ప్రభూ||
3. అమృతమైన ఆహారమా - దాహం తీర్చు జీవజలమా
నిత్యం నిన్నే నమ్మితిని - తప్పక నన్ను ఆదుకోవా ||హే ప్రభూ||