Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హృదయాలనేలే నా యేసువా
ప్రియమార అర్పింతు నాజీవితం ||2||
ఈ కానుక - చిరుకానుక ||2||
రాజాధిరాజులకు చిరు కానుక ||2||
ఉల్లాస హృదితో అర్పింతును ||2|| ||హృద||
1. నీ జీవితంలో కొనియాడినావు
నిరు పేదరాలి చిరుకానుకను ||2||
నాకున్న సర్వం నీవే ప్రభూ ||2||
ఆనంద హృదితో అర్పింతును
అర్పింతును సమర్పింతును
ఆరాధ్య హృదితో అర్పింతును ||2|| ||హృద||
2. నీ తండ్రి వరములు ఈ దివ్యబలిలో
కురిపించినావు నీ దివ్య కృపతో ||2||
మా కష్టఫలములు ఈ కానుకలు ||2||
మేలెరిగిన మనసుతో అర్పింతును
అర్పింతును సమర్పింతును
ఆరాధ్య హృదితో అర్పింతును ||2|| ||హృద||