Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 6
(నా) హృదయము నిండా నీవుంటే
వేరే వ్యక్తికి చోటేది ||2||
నా జీవితమంతా నీవుంటే వేరే ధ్యాసకు తావేది
వశము చేసుకో నా హృదయాన్ని
` ఆవరించుకో నా జీవాన్ని ||2||
ఆరాధన నా ప్రాణయేసువా
` ఆరాధన నా ప్రాణయేసువా ||2||
1 వ చరణం..
నీకోసం నేనేమి చేశానని ` ఇంతటి భాగ్యమయ్య
నాకింతటి భాగ్యమయ్య ||2||
నీ మనసున గ్రహించలేని బలహీనుడనయ్య ||2||
నా యేసయ్య..... నా యేసయ్య.....llవశముll
2 వ చరణం..
నా కోసం నీ రక్తం చిందించావని
తెలిసినప్పటికీ దేవా నిను నమ్మలేదు ప్రభువా ||2||
నీ గాయాలలో నన్ను దాచి రక్షించవ దేవా
దయచూపుము రాజా... దయచూపుము రాజాllవశముll