Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హల్లేలూయా...హల్లేలూయా... ||2||
హలేలూయా...హల్లేలూయా... ||2|| ఆమెన్
హృదయాన్ని మీటిన శుభవచనం
హృదయేశుని పవిత్ర సంకల్పం ||2||
హృదయాంతరంగాలలో
నింపుకొనే మాధుర్యం
హృదయాలను మార్చే అమర స్వరం ||2|| ||హల్లేలూయా||
1. శూన్యాన్ని మార్చిన సుగంధ వాక్యం
సర్వాంగ సుందరం-అవునుగాక
అని నుడివిన మాట ||2||
సర్వలోక సమస్త మానవాళికీ
స్ఫూర్తి వాక్యం సర్వకాలం వెలగాలి
మా మనసులలో దేదీప్యముగా ||హల్లేలూయా||
2. అహర్నిశలు కష్టాల్లో వేసారే ప్రజకు అండగా
ఆశతో నీ నామం జపియించే
వాళ్ళకు ఓదార్పుగా ||2||
ఆత్మతో అక్కున చేర్చుకొన్నదే
ఈ మధుర వాక్యం
అభయంతో వరాలిచ్చే ఈ నీ సుగంధవాక్యం
||హల్లేలూయా||