Type Here to Get Search Results !

లాలి లాలిజో జోలాలి ( laali laalijo jolali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


లాలి లాలిజో జోలాలి లాలిజో

లాలిజో లాలిజో లాలిలాలిజో

చిరునవ్వు చిందే చిన్నారియేసా

పరలోక జ్యోతిగా వెలసెనయా 

లాలపోసి జోలపాడగ నిలిచేవో బాలయేసా ||లాలిజో|| 


1 వ చరణం.. 

సిరిమల్లె పూవల్లే తెల్లగ

నీ బోసినవ్వులు రవళించెనే

జాబిల్లి వెలుగల్లే చల్లగ 

నీ కాంతి నయనాలు జ్వలియించెనే

విరజాజులతో వింజామరలూపన 

ఎద దివ్వెగ వెలిగించి హరతులివ్వనా ||లాలిజో|| 


2 వ చరణం.. 

మందార మొగ్గలే ఎర్రగా

నీ లేత పాదాలు శోభించెనే

సింధూర బొట్టలే ముద్దగ

నీ స్నిగ్ధ వదనం మురిపించెనే 

విరజాజులతో వింజామరలూపనా

ఎదదివ్వెగ వెలిగించి హారతులివ్వనా ||లాలిజో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section