Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. లాలి లాలి లాలి లాలమ్మ లాలీ
లాలనుచు పాడరే బాలయేసునకు ||లా||
1. పరమ పథము నుండి బైలుదేరెనమ్మా
నరుల పాపము లెల్ల నిరసించే నమ్మ ||లా||
2. పుడమిపై శిశువుగా బుట్టెనోయమ్మా
ఒడయుడై లోకమున వర్థిల్లెనమ్మా ||లా||
3. ఇహ పరంబుల కర్త యితడె ఓయమ్మా
మహిపాలనము జేయు మాన్యుడో యమ్మా ||లా||
4. భగవధాగ్రహము బాపునోయమ్మా
అగణితంబగు బాలుడై ప్రోచునమ్మాలా ||లా||
5. మనుజాళి దేవునకు మధ్యస్తుడమ్మా
ఘనమైన బాల్యమును గాంచెనోయమ్మాలా ||లా||
6. ఆది యంత్యములేని యాతడోయమ్మా
ఆదాముని దోషమున కడ్డుపడెనమ్మాలా ||లా||
7. జూదులకు రాజుగా యుండునోయమ్మా
జూద జనములు చాల వాదింతురమ్మాలా ||లా||
8. ఘనుడు నరగొర్రెలను గాచునోయమ్మా
పనుపడగ లోకముల బాలించునమ్మాలా ||లా||
9. పాప నరరూపము బడసెనోయమ్మా
ఏప్రొద్దు పాపులను నేలునోయమ్మా |||లా||