Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
లాలిజో జో లాలిజో నా బాలయేసా లాలిజో
లాలిజో జో లాలిజో నా చిన్నిబాలా లాలిజో
ఈ లోకమును రక్షింపగను
ఈ జగతిలో జనియించితివి
ఈ రేయి నా ఒడిలో పవలించితివా
1 వ చరణం..
దూతలు వచ్చిరి స్తుతులు చేయగా
నిను మించిన రారాజులేడని
గొల్లలు వచ్చిరి వణికే చలిలో
ఆరాధించగ నిన్నుఈ రాతిరిలో
ఇటు చూడవయ్యా కరుణించమయ్యా
చిరునవ్వుతో వీరిని దీవించుమయ్యాఇటు
2 వ చరణం..
జ్ఞానులు వచ్చిరి తూ రుపు నుండి
నిరుపేదగా పుట్టిన నిను కొలువగను
చిరుకానుక లర్పించిరి నీ కోసము
మిర్రా సాంబ్రాణి పరిమళ ద్రవ్యం ఇటు
3 వ చరణం..
ఈ భువియందున మానవులెల్లా
తమ రక్షణ కోసం తపియిస్తున్నారు
సాతాను పాప బంధం నుండి
విడిపించే నీ కోసం చూస్తున్నారు ఇటు