Lyrics: Fr. Emili Raju
Tune: unknown
Music: Christopher Babu
Album: అమృత స్వరం
ప. లాలిజో ||2||
చిన్నారి యేసుకు లాలిజో
ముద్దులొలికే బాలుడు లోకాలనేలే రారాజు
నిన్ను నన్ను రక్షించే
గొప్పదేవుడు-గొప్పదేవుడు ||లా||
1. ఊరు నిదురోయే సమయములోన
వరమేరిసుతుడు ఉదయించే భువిలో
మరియమ్మ ఒడిలో పవళించే యేసు
పశువుల పాకలో పున్నమి వెలుగులో ||లా||
చింతలేక చెంత చేర రండి ఓ జనమా
చూడ చక్కని బాలునికి జోలపాడరే
జోలపాడరే - లాలి పాడరే ||2|| ||లా||
2 దూతల గానం నింగిలోన తారవెలుగు
జగతికి తెలిపే రక్షకుని రాకను
జాలి గల దేవుడు ఈ చిన్ని బాలుడు
బ్రతుకు బాగు చేయును
స్వర్గ ద్వారం చూపును ||చింత|| ||లా||