Type Here to Get Search Results !

లాలీ యనుచు పాడరే ( lali yanuchu padare Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Br. B Anil Kumar 

Tune: unknown 

Music: RaviKiran B, Praneeth D 

Album: లాలనుచు పాడరే - 2 


ప. లాలి లాలి లాలి 

లాలి యనుచు పాడరే ||2|| 

దివ్య బాల యేసునికి 

లాలి పాట పాడరే ||2|| 

పరవశించి ఆడరే 

తనివితీర పొగడరే 

చిన్ని బాల యేసునికి 

జోలపాట పాడరే ||2|| 


కో: లాలి లాలి లాలి జో లాలి ||2|| 


1. నరరూప ధారియైన 

దైవ సుతుని చూడగా ||2|| 

ముదము తోడ చేరరే 

భక్తితో పూజింపరే ||2|| 

పొత్తి గుడ్డలందు చుట్టి

తొట్టిలో పరుండిన ||2|| 

మహిమాన్విత శిశువును 

ఆర్తితో ప్రార్ధించరే ||2|| ||లా|| 


2. పరమునందు మహిమయని 

భువిపైన శాంతియని ||2|| 

దూత గణముతో కలిసి 

దివ్యగీతి పాడరే ||2|| 

ఆవనిని రక్షించు రాజు 

అవతరించి నాడనుచు ||2|| 

గొల్లలు జ్ఞానులతో కలిసి 

శుభవార్తను చాటరే ||2|| ||లా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section