Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
లాలి లాలి లాలమ్మ లాలీ -
లాలనుచు పాడరే బాలుడగు యేసున్
1. పరమ పదము నుండి బైలుదేరెనమ్మా-
నరుల పాపములెల్ల నిరసించె నోయమ్మ ||లాలి||
2. పుడమిపై శిశువుగా బుట్టెనోయమ్మా -
ఒడయుడై లోకమున వర్ధిల్లెనమ్మా ||లాలి||
3. ఇహ పరంబుల కర్త యితడే ఓయమ్మా
మహిపాలనము జేయు మాన్యుడో యమ్మ ||లాలి||
4. భగవడాగ్రహము బాపునోయమ్మా -
అగణితంబగు బాలుడై ప్రోచునమ్మా ||లాలి||