Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
లాలియనుచు పాడరే బాలయేసుకు -
జోలపాట పాడరే చిన్ని యేసుకు
లాలి...జో..లాలీ... లాలి...జో...జో...లాలి
1. దివిలోన దూతలతో మహిమయనుచు పాడరే-
భువిలోన మనుజులకు శాంతియనుచు పాడరే
2. దీనుల కొరకే వెలసిన బాలయేసుని చూడరే-
పేదల కొరకే పుట్టిన పసిబాలుని చూడరే
3. మరియు తల్లి గర్భాన అవతరించె సుతుడు-
తప్పిపోయిన గొర్రెలను వెదకవచ్చే నతడు