Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
లెక్కలేని పాపాలు భారమైన జీవితం
నూనెలేని దీపములా సాగుచున్న జీవితం ||2||
పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా
మరలా మాకు పునర్జీవితమొసగుమో నాథా ||2|| ||కరుణ||
పల్లవి : కరుణ చూపుమా నాపై కనికరించుమా
పాపిని నేను నాథా - పాపినీ నేను ||2||
1. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా
వ్యాధియు, బాధలు అధికమాయెను
దేవ దేవుని ఆత్మ నాలో నిర్జీవమై
పాపం నన్ను పాతాళ త్రోవలో చేర్చి
2. వేంచేసి రావయ్య మంచి దైవమా
ప్రేమను కరుణను ఒసగుమో ప్రభువా
పదిరెట్ల ప్రేమతో తిరిగి నే వచ్చెద
మరల నన్ను నీ రెక్కల నీడలో నుంచు