Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. లూర్థుమాతా.. చల్లని తల్లీ
దయగల తల్లీ...పాలించే రాణివి
మీకే మా పుష్పాంజలు-లర్పింతుమమ్మా
1. నవకోటి జనులకు వెలసిన మాతవు
ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు ||2||
పుష్పించే నీ హృదయం వికసించే నీ నామం
ఆదర్శ తల్లివి నీవేనమ్మా ||2||
2. ఎన్నెన్నో కానుకలు అర్పింతు నీ ఒడిలో
నీ మహిమచే నేడు సఫలమాయె కోరికలు
వెలుగొందే నీ మహిమ
ఆదరించె అనురాగం
ఆదర్శ తల్లివి నీవేనమ్మా ||లూర్థు||
3. పవిత్రమైన నీ ప్రేమ నిలిచెను ఈ భువిలోన
నీ అనురాగమే నిండేను మాలోన
అందమైన నీ రూపం కలిగించే ఆనందం
ఆదర్శ తల్లివి నీవేనమ్మా