Song Lyrics in Telugu
మహిమగల తండ్రి - మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు
తన పుత్రుని రక్తనీరు - తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను - కాపుగావుంచాడు (2)
కాయవే తోట - కమ్మని కాయలు
పండవే చెట్టా - తియ్యని ఫలములు "కాయవే"
నీతి పూత జాతికాపు - ఆత్మశుద్ది ఫలములు
నీ తండ్రి నిల్వచేయు - నిత్య జీవ నిదులు
అనంతమైన ఆత్మ బందు - అమరసుఖ శాంతులు
అనుకూల సమయిమిదే - పూయు పరమ పూతలు (2) "కాయవే"
అపవాది కంటబడి - కుంటుబడి పోకు
కాపు పట్టి చేదు పండ్లు - గంపలుగా కాయకు
వెర్రిగా చుక్కలంటి - ఎదిగి విర్రవీగకు
అదిగో గొడ్డలి వేరున - పదును పెట్టియున్నది (2) "కాయవే"
ముద్దుగా పెంచాడు - మొద్దుగా లేకుండా
ముదముతో పెంచాడు - మోడుబారిపోకు
ముండ్ల పొదలలో కృంగి - మెత్తబడిపోకు
పండ్లుకోయువాడు వచ్చి - అగ్నివేసి పోతాడు
Song Lyrics in English
Mahimagala Thandri - Manchi Vyavasayakudu
Mahitotalo Nara Mokkalanu Natinchadu
Tana Putruni Rakthaneeru - Tadi Katti Penchadu
Tana Parishuddhatmaku - Kaapugaavunchadu (2)
Kaavave Thota - Kammani Kaayalu
Pandave Chetta - Tiyyani Phalamulu "Kaavave"
Neeti Poota Jaateekapu - Aatmasuddhi Phalamulu
Nee Thandri Nilvachheyu - Nithya Jeeva Nidulu
Ananthamaina Aatma Bandu - Amarasukha Shaantulu
Anukoola Samayimide - Pooya Parama Puthalu (2) "Kaavave"
Apavadi Kanta Badi - Kuntubadi Poku
Kaapu Patti Chedu Pandlu - Gampaluga Kaayaku
Verriga Chukkalanti - Edigi Viraveegaku
Adigo Goddali Veruna - Padunu Pettiyunnadi (2) "Kaavave"
Muddhuga Penchadu - Modduga Leekunda
Mudamutho Penchadu - Modubaaripoku
Mundla Podalalo Krungi - Meththabadipoku
Pandlukoyuvaadu Vachi - Agnivesi Pothadu