Song Lyrics in Telugu
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు - మహిమలో నేనాయనతో నుంటేమేలు
నిత్యమైన మోక్షగృహము నందు చేరి - భక్తుల గుంపులో హర్షించిన చాలు
1.
యేసుని రక్తమందు కడుగబడి-వాక్యంచే నిత్యం భద్రపరచబడి
నిష్కళంక పరిశుద్ధులతో పోదున్ నేను-బంగారు వీదులలో తిరిగెదన్ "ప్రియ"
2.
దూతలు వీణలను మీటునపుడు-గంభీర జయద్వనులు మ్రోగినపుడు
హల్లెలూయ పాటల్ పాడుచుండ-ప్రియ యేసుతోను నేను ఉల్లసింతున్ "ప్రియ"
3.
ముండ్ల మకుటంబైన తలనుజూచి-స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్
కొరడలతో కొట్టబడిన వీపునుజూచి-ప్రతి యెక్క గాయమును చుంబింతును "ప్రియ"
4.
హృదయము స్తుతులతో నింపబడె-నా భాగ్య గృహమును స్మరించు చుంటె
హల్లెలూయ.....ఆమేన్,హల్లేలూయా..- వర్ణింప నా నాలుకచాలదయ్యా "ప్రియ"
5.
ఆహ! యా బూర యెపుడు ధ్వనించునో - ఆహా ! నా ఆశ యెపుడు తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో-ఆశతో వేచియుండె నా హృదయము "ప్రియ"
Song Lyrics in English
Priya Yesu Raajunu Nee Choochina Chaalu - Mahimalo Nenayanatho Nuntemelu
Nityamaina Mokshagrihamu Nandu Cheri - Bhaktula Gumpulo Harshinchina Chaalu
1.
Yesuni Rakthamandu Kadugabadi - Vaakyanche Nityam Bhadraparachabadi
Nishkalanka Parishuddhatulo Podun Nenu - Bangaaru Veedulalo Thirigedan "Priya"
2.
Dootalu Veenaalu Meetunapudu - Gambheera Jayadwanulu Mroginapudu
Halleluya Paataal Paaduchunda - Priya Yesutho Nenu Ullasinthun "Priya"
3.
Mundla Makutambaina Thalanujooki - Swarna Kireetam Betti Aanandinchun "Priya"
Koradalo Kottabadina Veepunujooki - Prathi Yekka Gaayamunu Chumbinthun "Priya"
4.
Hrudayamu Stuthulatho Nimpabade - Naa Bhagya Grihamunu Smarinchu Chunte
Halleluya.....Aamen, Halleluya - Varnimpa Naa Naalukachaaladayya "Priya"
5.
Aah! Yaa Bhoora Yepudu Dhwaninchuno - Aaha! Naa Aasha Yepudu Theeruthundho
Tandri Naa Kannetini Thuduchu Nepudo - Aashatho Vechiunde Naa Hrudayamu "Priya"