Song Lyrics in Telugu
రక్షకుండుదయించినాడు - మనకొరకు పరమ - రక్షకుండుదయించినాడు
రక్షకుండుదయించినాడు - రారెగొల్లబోయలార - తక్షణమునబోయి మన నీ
రీక్షణ ఫల మొందుదము "రక్షకు"
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు - దేవుడగు యెహోవా
మన దిక్కుదేరి చూచినాడు "రక్షకు"
గగనమునుండి దిగి ఘనుడు గబ్రియేలు దూత - తగినట్టు చెప్పి వారికి
మిగుల సంతోష వార్త "రక్షకు"
వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాడు - కర్తను
జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు "రక్షకు"
పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రముజుట్టీ - శిశువును కను గొందురని
శీఘ్రముగను దూత తెల్పె "రక్షకు"
అనుచు గొల్ల లొకరి కొకరు ఆనవాలు జెప్పుకొనుచు - అనుమతించి
కడకు క్రీస్తు నందరికినీ దెల్పినారు "రక్షకు"
Song Lyrics in English
Rakshakundudayaninchadu - Manakoraku Parama - Rakshakundudayaninchadu
Rakshakundudayaninchadu - Raaregollaboyalara - Takshanamunaboyi mana nee
Reekshana phala mondudamu "Rakshaku"
Daavidu vamshamandu dhanyudu janminchinaa - Devudagu Yehovaa
Mana dikku deri choochinaadu "Rakshaku"
Gaganamunundi dighi ghanudu Gabriyelu dootha - Taginattu cheppi vaariki
Migula santhosha vaartha "Rakshaku"
Varthamanamu jeppee dootha vaibhavumun povuchunadu - Kartanu
Joochina venuka kaantumu vishramam bappudu "Rakshaku"
Pashuvula tottilona bhaasillu vastramujuutti - Shishuvunu kanu gondurani
Sheeghramuganu dootha telpe "Rakshaku"
Anuchu golla lokari kokaru aanavaalu jeppukonuchu - Anumatinchi
Kadaku Krithu nandarikini delpinaaru "Rakshaku"