Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రారమ్మ మన తండ్రి రాయప్పగారు తిరుణాలతో
మనము కొనియాడెదము
1:-
గలిలేయ దేశమున బెత్తోని యూరిలో హేబ్రేయా
కులమందు పుట్టియున్నారు ll రారమ్మ ll
2:-
పల్లె వారివలె పల్లె కారులై చేపలు పట్టెడు పని వీరు చేసే ll రారమ్మ ll
3:-
రోమ పురి యందుండే మన తల్లి యైన
సత్య తిరుసభకు మొదటి పాపులై ll రారమ్మ ll
4:-
తలక్రిందుగా వీరు స్లీవలో పడిరి
స్లీవలో పడి వీరు ప్రసంగించిరిll రారమ్మ ll
5:-
నీల వర్ణముగల వారి నీడలో పడిన
మాత్రముననే పోయె రోగములా ll రారమ్మ ll
6:-
అననీయ సఫేరయను దంపతులను
దబ్బర లాడగ తెలిపి జంపిరీ ll రారమ్మ ll
7:-
పరలోక రాజ్యపు బీగములు వీరి
బలిమిగల చేతికి యివ్వబడెను ll రారమ్మ ll