Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: సజీవదేవుని పూజింప
సద్గుణ శీలుని సేవింప
యేసు రాజుని వినుతింప
తరలి రారే దైవజనమా
దివ్య మంగళ రూపుని గనుమా ||2|| ||సజీవ||
1. లోకమునెంతో ప్రేమించి
మానవ శాపం తొలగింప ||2||
పితయగు దేవుడు పంపించే ||2||
తన ప్రియసుతుని... శ్రీయేసునీ ||సజీవ||
2. దేవుని రాజ్య ము స్థాపించ... ||2||
జీవన మార్గము చూపించ ||2||
శిలువలో ప్రేమను చూపించి ||2||
మానవ రక్షణ గావించే ||2|| ||సజీవ||