Song Lyrics in Telugu
సర్వకృపానిధి యగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముతోనిను పొగిడెదము
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ..హల్లెలూయ..
హల్లేలూయ యని పాడెదము... ఆనందముతో సాగెదము
1
ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై - పాపిని ననుకరుణించితివి "హల్లె"
2
అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి
నాధుని అడుగు జాడలలో - నడుచుటకు నను పిలచితివి "హల్లె"
3
మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నన్ను నింపితివి - మరణభయములను తీర్చితివి "హల్లె"
4
భువి నుండి శ్రేష్టఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలోనుండి నన్ను - ప్రేమించి క్రయ ధనమిచ్చితివి "హల్లె"
5
ఎవరు పాడని గీతములు - యేసుతో నేను పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెన్ - యేసుకు నేనేమివ్వగలన్ "హల్లె"
Song Lyrics in English
Sarvakripanidhi Yagu Prabhuvaa
Sakala Charaachara Santoshamaa
Stotramu Chesi Stutinchadamu - Santoshamuthoninu Pogidehamu
Halleluya Halleluya - Halleluya..Halleluya..
Halleluya Yani Paadehamu... Aanandamutho Saagedhamu
1
Preminchi Nannu Vedakithivi - Preethitho Nanu Rakshinchithivi
Parishuddhamuga Jeevinchutakai - Paapini Nanukaruninchithivi "Halle"
2
Alpakaala Shramalanu Bhavimp - Anudhinamu Krupanichchithivi
Naadhuni Adugu Jaadalolo - Naduchutaku Nanu Pilachithivi "Halle"
3
Maranam Shareeramu Maarpunondi - Mahima Shareeramu Pondutakai
Mahimaathmato Nannu Nimpithivi - Maranabhayamulu Theerchithivi "Halle"
4
Bhumi Nundi Shreshthaphalamuganu - Devuniki Nithya Swaasthyamuga
Bhoojanamulonundi Nannu - Preminchi Kraya Dhanamichchithivi "Halle"
5
Evaru Paadani Geethamul - Yesuto Nenu Paadutakai
Hethuvi Lekaye Preminchen - Yesuku Neneemivvagalanu "Halle"