Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శత్రు ప్రేమ యేసునాథుని ముద్రయే కదా, ఆయన మార్గమే కదా
శత్రుని సహితం మిత్రుని చేయ శక్తిగలవాడు, యేసు ప్రేమగలవాడు
1. కంటికి బదులు కన్నుకాదని పంటికి బదులు పన్నుగాదని
ప్రేమరూపుడు యేసునాథుడు నేర్పినాడు ,
పరమ తండ్రికి ప్రియమైన బిడ్డలవ్వాలి ఒక్కటై చేరువవ్వాలి
2. కుడి చెంపపై కొట్టువానికి, ఎడమ కూడా చూపాలి
శ్రమలతోనే జీవితాన్ని మహిమ పరచాలి
సిలువద్దారుని చెంత చేరి క్షమను చూపాలి హృదిలో స్థానమివ్వాలి