Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. శాశ్వత జీవం ఈ విందు
ఇలదైవ నివాసం ఈ విందు ||2||
నరజాతి నిత్య నిబంధనము
నజరేయుని నిజ దర్శనము ||2||
ప్రభు సన్నిధాన మీ విందు ||శాశ్వత||
1. ఆది దంపతుల పాప కర్మముల
విడుదల యోగము ఈ విందు. ||2||
పాప రహితుని పుణ్య కార్యము
లోక కళ్యాణమీ విందు ||2||
పరమ సంజీవ ధార ఇదే
ఆత్మ సంతోష ద్వార మీదే
దీవిని పరమాత్మ - ధరను జీవాత్మ
దివ్య సంగమం విందు ||శాశ్వత||
2. పుణ్య చరితుని ప్రాణ త్యాగము
పవిత్ర యాగము ఈ విందు ||2||
పరంధాముని పునరుత్థానం
పునర్దర్శనం ఈ విందు ||2||
అక్షయానంద సారమిదే
ఆధ్యాత్మిక ఆహారమిదే ||2||
దివిని పరమాత్మ - ధరను జీవాత్మ
దివ్య సంగమం విందు ||శాశ్వత||
3. >సిలువనాధుని ప్రేమ విందుకు -
పిలువబడిన మన అందరకు
దేవదేవుని కృపావరమును ...
అనుగ్రహించును ఈవిందు ||2||
ప్రేమ కురిపించు విందు ఇదే ...
పాప పరిహార విందు ఇదే ||2||
దివిని పరమాత్మ ధరను జీవాత్మ-
దివ్య సంగమం విందు llశాll