Lyrics: Fr. Gnanam SDB
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -4
ప. శ్రీకరా స్వీకరించుమయా
శుభకరా ఆదరించుమయా ||2||
మమతలు మనసులను
అర్పణంబుగా చేకొను దేవా
నిరాదరింపక మమ్ము నీవు ||2|| ||శ్రీ||
1. ఈ లోకపు భోగ భాగ్యము
నీకు యోగ్యత కాదయ్యా ||2||
పొరుగు వారిని క్షమను కోరే
హృదిని మలిచే చేరితిమయ్యా ||2|| ||శ్రీ||
2. హింసించు సౌలు హృదిని పౌలుగా
నీవు మలచినట్లే మాదు మనసులను
మార్చి నీకు అర్పింపగ చేరితిమయ్యా ||శ్రీ||