Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. శ్వేత వర్ల రవికిరణం - ఆ ప్రభు వాక్యం
ప్రేమ శాంతి ఆనందం - ఆ ప్రభు మార్గం
ఓ విశ్వ జనమా - ఆలకించుడి ఈ వాక్యం
ఆశ్రయించి అనుభవించుమా
ఆ... అల్లెలూయా... ఆ... అల్లెలూయా ||2||
1. అగునుగాకయని పలికెను -
ఆ ప్రభు వాక్యం
ఆరంభమాయెను ఆదియందు ఈ సృష్టి ||2||
చీకటి జగతిని కనువిందు చేయగా
సూర్య చంద్ర తారలను
ఒసగినాడు ఆ ప్రభువు
ఆ... అల్లెలూయా... ఆ... అల్లెలూయా ||2||
2. ప్రభు మరణముతో మార్తాండ రశ్మిని
మబ్బులు మూసెను సిలువపై ప్రభుని క
మ్మెను పాపాంధకారము
జీవ మార్గము - ఆ ప్రభుని వేదము ||2||
ప్రజ్వరిల్లగా అనురాగం
ఆత్మలోని ఆనందం ||2||
ఆ.......అల్లెలూయా.....
ఆ....అల్లెలూయా ||2|| ||శ్వేత||