Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: శుభములు నిండిన దేవళము
యెరుషలేము ప్రభు ఆలయము
ఇస్రాయేలుల దావీదు వంశుల
పవిత్ర దేవుని మందిరము....
మదస మదని దమ సానీద మగరిస ||శుభములు||
1. దావీదు వంశపు న్యాయ మకుటం
యెరుషలేమున నిలిచిన సత్యం ||2||
నీ ప్రాంగణమున శాంతియు
నీ మందిరమున రక్షణ కలదు
మదస మదని దమ సానీద మగరిస ||శుభములు||
2. ప్రభుని ఆజ్ఞను పాటించుటకు
దేవుని తెగలు అరుదెంచారు ||2||
ద్వారములోపల అడుగిడునంతనే
వందనములు సమర్పించారు
మదస మదని దమ సానీద మగరిస ||శుభములు||