Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
శుభశ్రీ యేసుని గైకొనుదామా
ప్రభు యేసుకు - స్తుతిగానము చేతుమా ||2|| llశుభll
1 వ చరణం..
సత్ప్రసాద రూపం - మీ దివ్యదేహం
ద్రాక్ష రస పానం - మీ దివ్యరక్తం ||2||
నిరతము మిము - సేవింతుము దేవా ||2||
ప్రభు యేసుకు - స్తుతి గానము చేతుమా ||2|| llశుభll
2 వ చరణం..
ఈ సత్ప్రసాదం - ఆత్మకు భోజనం
ఇదియే ముక్తి - మయ నవ జీవనం ||2||
నితరము మిము - సేవింతుము దేవా ||2||
ప్రభు యేసుకు - స్తుతి గానము చేతుమా ||2||llశుభll
3 వ చరణం..
దీన గణంబు - పాలియధీశ్వర!
పాపసంహార - పుణ్య ప్రధాత ||2||
నిరతము మిము - సేవింతుము దేవా ||2||
ప్రభు యేసుకు - స్తుతిగానము చేతుమా ||2|| llశుభll