Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: వరప్రసాదం
ప. శ్రీయేసు నామమే ప్రలాపనా
శ్రీ క్రీస్తు నామం నా ఆలాపనా ||2||
స్తోత్రమయ్యా యేసయ్యా ||2||
స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా యేసయ్యా
1. సత్యమై, జీవమై నిలచినా నామం
మార్గమై మనుజులను నడిపిననామం||2||
దీవిని వీడి భువికి దిగిన దివ్యనామం ||2||
పాపాలు మన్నించు పరిశుద్ధ నామం
(శ్రీ) యేసునామం ||శ్రీ|||
2. ధరణిలో ధన్యత నొందినా నామం
వెలుగై చీకటి తొలగించిన నామం
రక్తధారలై చిందిన రక్షణ నామం ||2||
మన కొరకై కలువరిలో బలియైన నామం
(శ్రీ) యేసునామం ||శ్రీ|||