Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్రీ యేసు భగవాన్ తన ప్రేమనిచ్చి
కన్నీరు తుడుస్తాడు
సంతాపమంతా తీరిన వేళలో
ఉల్లాసం పొంగునులే
మేఘతేరుపై తన ప్రక్కనుంచుకొని
స్వర్గ రాజ్యంలో మనన్ చేర్చునులే
అమ్మకూడా అబ్బురమౌ
తనప్రేమ కూడా పొందుచుంటిమి ||శ్రీయేసు||
1. ఈ ప్రపంచ సంతోషం కోసం
నడిచాను నేను పెడదారి
ప్రేమ కోరి మోహతలంపు
పాపపు మార్గం నడిచాను
నేనింత చేసినా కోపపడక
ప్రేమతోడ రక్షించితివి
అంత్య తీర్పున భయపడకుండా
ప్రభు ముఖమ్మే చూచెదరు ||శ్రీయేసు||
2. స్తుతులు పాడి ఆనందహేల
ఆయన నామం పొగడెదను
ఆపదయందు కాపాడు వాడని
ఆయన కరుణను చాటెదను
పాపంలో పడ్డ తోటివారికి
చేయూతనిచ్చి తోడుందాం
గర్వంతో పడిన వారిని ప్రేమతో
ముద్దాడి పైకి లేపెదము ||శ్రీయేసు||