Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 4
సాకీ:స్తుతి సింహాసనాసీనుడా - ప్రధాన యాజకా
గురువుల గురువా - క్రీస్తు నాయకా
నమస్తే.....నమస్తే..... నమస్తే.... నమోనమ: ఆ... ఆ...
పల్లవి:
మా దేవుని ఉత్సవము - మా క్రీస్తుని సంబరము
మా గురువుల - ప్రేమోత్సవము
రండి ప్రియులారా రండి కతోలికులారా
ఆరాధించుదాం ఆనందించుదాం ||2||
మనసారా దీపం ధూపం పుష్పం - హారతులిడుదాం ఆ... ఆ...
1 వ చరణం..
తొలి కూతవేళ ఉత్థాన ఘడియలో
మది నిండుగా ప్రభువుండగా
కలువరి బలిలో జీవింప
ఉత్సాహించుదాం ఉల్లాసించుదాం ||2||
వినయముతో శిరమువంచి
ప్రభువుని ప్రణుతించుదాం llమా దేవునిll
2 వ చరణం..
మట్టి మనిషిని - బంగారు మనిషిగా
మార్చే ప్రభు బలిని - స్మరియించుదాం ||2||
కరములు మోడ్చి పూజింప ||2||
ఆస్వాదించుదాం ఆహ్వానించుదాం ||2||
ముదమార తనువు మనసు పరచి - పరవశించుదాం llమా దేవునిll