Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
పల్లవి:
సుమములతో సాగుదము -
కల్వరి పీఠం చేరుదము
శాంతి స్వరూపుని సేవింతుము -
యేసుని అర్చన చేయుదము
మన ప్రభు యేసుని ఆగమనం -
ఘనముగ పొగడుచు పాడుదము
1 వ చరణం..
ప్రేమను నేర్పిన మన ప్రభువే -
సేవలు చేసెను మనకొరకు
ఆయనయే మన నాయకుడు -
ఆయనకే యిల స్తుతి మహిమ
2 వ చరణం..
స్వస్థత గూర్చెను మన ప్రభువే -
రక్షణనిచ్చెను పాపులకు
ఆయనయే మన పాలకుడు -
ఆయనకే ఇల స్తుతిమహిమ
3 వ చరణం..
ప్రాణం పోసిన మన ప్రభువే -
ప్రాణం నిచ్చెను మన ప్రభువే
ఆయనయే మన రక్షకుడు -
ఆయనకే యిల స్తుతి మహిమ