Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: సుమధుర గీతాల సుస్వాగతం
శృతిలయస్వరముల సంగమం
దేవ దేవుని సన్నిధిలో
సమర్పించే బలి అర్పణం
భక్త జనులహృదయార్పణం
పూజ్యగురువుల సమర్పణం ||సు||
1. ఆలయ గంటల ఆలాపన విని
ఆనందముతో క్రీస్తుని చేరగ ||2||
స్వాగత గీతిని ఆలపించగా
ఈబలిపూజకు సిద్దపడితిని ||సు||
2. కలువరి బలియే కలుషహరణము
పాప విమోచనే ముక్తికి మార్గం ||2||
భక్తి శ్రద్ధలతో దేవుని కొలువ
మారుమనస్సుతో నీదరి చేరితి ||సు||