Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి : త్రిలోకనాథా తిమిర సంహారా -
కరుణాలవాల కమనీయ రూపా
దేవా మమ్మిల బ్రోవు మా నిను ఆశ్రయింప
సగనిస మపదమ
ప: సుప్రభాతవేళలో విరిసిన కుసుమాలతో
స్వాగతించు దేవా నా ప్రాణనాధా
నింగికురిసె హిమముతో నీవిచ్చిన గళముతో
ముదమార వందింతు రాజాధిరాజా
సనిపమగమ నిపగరిస
1. నీతో ఏకమయ్యే ఈ పూజార్చనలో
రూప దీప నైవేద్యం ప్రీతితో గొనుమా .
మా తనువు మా మనస్సు మరుమల్లెలుగా మార్చి
స్వర్గ రాజ్య సౌభాగ్యం మాకిల పఠియించి దీవించుదేవా
2. అత్యంత ప్రీతి గొలిపే శ్రీక్రీస్తు బలిలో
పాల్గొన్న మమ్ములను ప్రేమతో బ్రోవుమా
మీ వాక్కు ప్రేరణలో తరియింపజేసి
నిత్య జీవమార్గమందు మము ఇల నడిపించు
నిను చేరనివ్వు నిను చేరనివ్వు