Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: స్పందన
సా.కీ. సృష్టికర్త తండ్రిదేవుని ఆరాధింప
రక్షణదాత క్రీస్తు ప్రభుని ప్రార్థింప
వరప్రదాత పవిత్రా సర్వేశ్వరుని ప్రణుతింప
దైవజనమా రారే త్రియేకదేవుని కొలువగ రారే
సాసససస గరి పగ రిని
సాసససస గరి పగరి
పాపపపప నిప సని సగ
పాపపపప నిప సనిస
పనిసరిగా గపనిసరీ
గాగరినని రీరిసనిప సాసనిపగ .
రెగపరిస గపనిస పనిసా
ప: సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగ ||2||
గుడిగంటలు మ్రోగే
ప్రభు పూజకు రమ్మని ||2||
ఆ జీవదాతను కొలువగ నేడే
పరిమళాల నవ సుమాల మాలలతో
కదలిరండి తరలిరండి వేవేగమే ||సు||
సరిసరిసరి గపగపగప
నిసనిసనిస గరిసనిపా
1. ఆదాము పాపము తనుబాపుటకు
అరుదెంచెను ఆదైవమే
మూసియున్న స్వర్గద్వారములు తెరుచుటకు
తానాయెను బలి గొఱ్ఱపిల్ల ||2||
కల్వరి బలి వేదికపై అర్పించే యాగబలి ||2||
ఆ దివ్య బలికి శుభ సమయమిదే
మచ్చలేని స్వచ్ఛమైన హృదయాలతో
కదలిరండి తరలిరండి వేవేగమే ||2|| ||సు||
2. అపవాది దాస్యమున మన విడుదలకు
తను చెల్లించే రక్తమూల్యము
పరలోక తండ్రి దరికి మనలను చేర్చ
నూతన పాస్కర తను మారెను ||2||
యాజకుడు అర్పించే ఈ దివ్య పీఠంపై
శాంతిదూత అతడు వేంచేయును ||2||
మరువలేని మధురమైన గీతికతో
పాడరండి కొలువరండి వేవేగమే ||2|| ||సు||