Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో
స్వాగతింతు దేవా నా ప్రాణనాథా
నింగి కురిసే హిమముతో
నీ విచ్చిన గళముతో
ముదమార వందింతు రాజాధిరాజా
1. మీతో ఏకమయ్యే ఈ పూజార్చనలో
ధూపదీపనైవేద్యం ప్రీతితో గొనుమా
మా తనువు మనస్సులను
మరు మల్లెలుగా మార్చె
స్వర్గ రాజ్య సౌభాగ్యం
మాకిల వరియించి దీవించు దేవా
2. అత్యంత ప్రీతి గొలిపే శ్రీక్రీస్తు బలిలో
పాల్గొన్న మమ్ములను ప్రేమతో గ్రోలుమా
మీ వాక్కు ప్రేరణలో తరియింపజెసి
నిత్య జీవమార్గమందు
మము యిల నడిపించు నిను చేరనివ్వు