Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: సుప్రభాత వేళలో కోకిల స్వరములతో
సుస్వరాల సరిగమలై సరాగాల సంగమమై
పలికినది శుభస్వాగతం
పూజకు వేళాయెనే త్వరపడి రారమ్మని
1. జేగంటల దివ్యరాగం విశ్వాసుల జీవనాదం
నిజదేవుని సన్నిధిలో నా హృదయం ఆనందగీతం
నన్ను నేను అర్పించుటకై
బలిపీఠము చెంతచేరి నీ పుత్రుని సన్నిధిలో
శరణుకోరి నిలిచితిని ||పూ||
2 మరియతల్లి జన్మదినంబు జరుపుకొనే
ఈ శుభవేళ బలిపూజలో పాల్గొనగ
వడివడిగా పరుగిడిరారే
మానవాళి మనుగడకొరకై
మనుజుడైన క్రీస్తునాధుని
దీవెనలను పొందుటకై
కదలిరారే ప్రియ జనమా