Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆఆఆ... ఆఆఆ.... ఆఆఆ .... ||2||
సుందర సంధ్యా సమయంలో-కోయిల తియ్యని గానంలో ||2||
పావనుని ఆరాధ్యుని - ప్రేమతో స్మరియింతుము ||2||
కోరస్ : తరలిరండి జనులారా - తండ్రిని స్తుతియించగా తరలిరండి ప్రియులారా - ఆత్మలో పూజింపగా
1 వ చరణం..
ఆకాశవీధిలో - సూర్యచంద్రులను -
అద్భుత రీతిలో చేసెను మనతండ్రి ||2||
అవనిలో మనిషిని కలిగించి -
భాగ్యములెన్నో కురిపించి వాత్సల్యముతో -
ప్రేమించి స్వర్గపు - మధురిమలందించె ||2||
ఆ.. ఆ... ఆ.... llసుందరll
2 వ చరణం..
మానవాళిని - ప్రేమించి వరియించి
మరియ గర్భంలో - నిలిపెను తన సుతుని ||2||
పాపపు నరులను కరుణించి - వాగ్ధానములను నెరవేర్చి ||2||
సిలువలో తన సుతునర్చించి - మానవ రక్షణ గావించే ||2||