Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith
Album: లోక రక్షకుడు
సా. స్వాగతం - సుస్వాగతం సింహాసనాసీనుడా
ష సింహాసనాసీనుడా-యూదాగోత్రపు సింహమా
స్తుతిపాత్రుడా-స్తోత్రార్హుడా... ||2||
మార్గమై-సత్యమై ||2||
మమునడుపు మహిమోపేత ||సి||
1. ఆదియునీవే అంత్యమునీవే ||2||
జీవము నీవే జయమునీవే... ||2||
నిఖిలేశ్వరా...ఆ....ఆ... .. ||2||
నిరత నివాసి-పరిశుద్దుడా
పరలోకరాజా ||సి||
2. అద్వితీయుడా - ఆదిసంభూతుడ
ఆశ్చర్యకరుడ - ఆలోచనకర్త ||2||
జీవేశ్వరా...ఆ...ఆ...- ||2||
జనితైకసుతుడా అజనీకరా...
ఆత్మస్వరూపుడ ||సి||