Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
స్వాగతం దేవా స్వాగతం
స్వాగతం ప్రభువా స్వాగతం. ||2||
ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా
సత్య స్వరూపుడా స్వాగతం... స్వాగతం. llస్వాll
1 కలువరి బలిలో కలుషము బాపిన
కరుణాసాగర స్వాగతం
మరణం గెలిచి రక్షణ ఒసగిన ||2||
జీవన దాతా స్వాగతం...స్వాగతం..llస్వాll
2. మమతను పంచి మంచిని పెంచిన
మా మంచి కాపరి స్వాగతం
మానవ జీవిత మార్గం చూపిన
మా మంచి సమరీయుడా
స్వాగతం స్వాగతం.. llస్వాll