Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకీ:
స్వాగతం......దైవ జనమా మీకిదే
మా హృదయ పూర్వక స్వాగతం
పల్లవి:
స్వాగతం ఓ జనులారా –సుమ స్వాగతం దైవ జనమా
రండీ యేసుని కొనియాడి – రక్షణ పొందగా ఈ బలిలో
1 వ చరణం..
యావే దేవుని అనురాగం
రక్షణ ప్రజలకు ఆత్మబలం
ప్రేమ నేర్పిన ప్రభు యేసు
ప్రాణ సమర్పణ ఈ యాగం llస్వాగతంll
2వ చరణం..
తనయుడేసుని బలియాగం
మానవ జాతికి కృపావరం
పాపకళంకపులోకమును
పావన పరిచిన బలియాగం llస్వాగతంll