Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా:
సా: ఆది మధ్యాంత రహిత - దివ్యతేజో విరాజిత
కన్య మరియ తనయా కరుణామయా
పవిత్రాత్మ దేవా పరమేశ్వరా
నమస్తే నమస్తే
త్రియేక దేవా నమస్తే (నమోస్తుతే) ||2||
పల్లవి
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుమస్వాగతం
మనసార మీకు ఘనస్వాగతం. ||2||
నవ పీఠాధిపతి అభిషేకం
ఇది కన్నుల పండుగ అభిషేకం
ఆర్యులకు అభిమానులకు
మాన్యులకు మహనీయులకు
ఇదే ఇదే మా ఆహ్వానం ||2||
1 వ చరణం..
అమృత హృదయం వేదికపై
శృతి లయలే మంగళ హారతులై
స్వరజతులే స్వాగత గీతికలై
సరిసరాగ రిగరిగాగ సరిగపప
పనిని నిసస సరిరి
సరిగ సగరిసని పనిస పసనిపగ
రీగప రిగరిసని నిసపని సరిస ||శృ||
మనోజ్ఞ మంగళ కోవెలలో
ఆత్మతో జరిగే అభిషేకం
ఇది కన్నుల పండుగ అభిషేకం
నవపీఠాధిపతి అభిషేకం ||ఆ||
2 వ చరణం..
పావన మరియ ఆశీర్వాదం
పరమ పునీతుల దీవెనవర్షం ||2||
గుండెల గుడిలో పులకిత హరం ||2||
యేసుక్రీస్తు అభయహస్తం
ఇది మీ భవితకు శ్రీకారం
మీ జీవితానికిది ప్రాకారం - ||ఆ||
3 వ చరణం..
నీవే బలమని నమ్మిన వారిని
నీ కను నీడలో నడిచేవారిని ||2||
పావనాత్మతో అభిషేకించి
పవిత్రమైన తైలం పూసి
యాజక వరమును అనుగ్రహించి
నీ పదసేవలో నిలుపుము దేవా ||ఇ||